telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

వైద్య శాఖకు సోకిన “టిక్‌టాక్”..ముగ్గురు సిబ్బంది పై చర్యలు

Kcr vedeo post youth arrest telangana

తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖకు “టిక్‌టాక్” వైరస్ సోకింది. అత్యవసర వేళలో వైద్య సెవలందిచాల్సిన వైద్యులు “టిక్‌టాక్” కు ఆకర్షితులవుతున్నారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి వైద్య విద్యార్థుల సస్పెన్షన్ మరువక ముందే మరో ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది.

కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులు కార్యాలయంలో టిక్‌టాక్ చేసినందుకు ముగ్గురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లు, ల్యాబ్ సహాయకురాలుని సస్పెండ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్‌లు దివ్యమణి, సమత, ల్యాబ్ సహాయకురాలు జయలక్ష్మిల పై సస్పెన్షన్ వేటు పడింది.

Related posts