telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

పండుగ సందర్భంగా .. బంగారం ధరలు దిగివస్తున్నాయా… ఇంకేమైనా మతలబు ఉందా..

gold and silver prices in markets

బంగారం ధరలు మూడు రోజుల తర్వాత స్వల్పంగా పెరిగినప్పటికీ గత నెలతో పోలిస్తే రూ. 2వేల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ మార్కెట్లో బుధవారం బంగారం ధర కాస్త తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 150 దిగొచ్చింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 39,800కు పడిపోయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 150 తగ్గింది. దీంతో ధర 10 గ్రాముల ధర 36,470కి క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం తగ్గకపోగా.. రూ. 500 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ. 48,500కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు దాదాపు ఇలాగే ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర రూ. 150 తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 38,450కి పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 150 తగ్గింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 37,250కి క్షీణించింది. అయితే, వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. రూ. 500 మేర పెరగడం గమనార్హం. దీంతో కిలో వెండి ధర రూ. 48,500కు చేరింది. బలహీనమైన అంతర్జాతీయ ట్రెండ్ కన్నా కూడా దేశీ జువెల్లర్స్, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ల విశ్లేషకులు చెబుతున్నారు. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి ధర కూడా పైకి ఎగిసిందని భావిస్తున్నారు. గత మూడు నెలల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర స్వల్పంగా పెరిగిపోయింది. ఔన్స్‌కు 0.28శాతం పెరుగుదలతో 1,491.20 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 1.33శాతం పెరగడంతో 17.55డాలర్లకు చేరుకుంది. బంగారం ధరలపై బ్రెగ్జిట్ ఆలస్యం తోపాటు పలు అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపుతున్నాయి.

Related posts