telugu navyamedia
రాజకీయ

శ్రీలంక అధ్య‌క్షుడు గొట‌బాయ ప‌రారి..

* పారిపోయిన శ్రీలంక అధ్య‌క్షుడు గొట‌బాయ ..
*రాజ‌ప‌క్స ఇంటిని చుట్టుముట్టిన ఆందోళ‌న కారులు
*రాజ‌ప‌క్స రాజీనామా చేయాల‌ని ఆందోళ‌న కారులు డిమాండ్‌
*శ్రీలంక‌లో కొన‌సాగుతున్న ఆందోళ‌న‌లు

ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక  అట్ట‌డగుతున్న వేళ మ‌రోసారి ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి.

ఈ క్రమంలో  అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలు, ప్రజలు ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు..దీంతో ఆందోళనకారులపై శ్రీలంక సైన్యం టియర్ గ్యాస్ ప్రయోగించింది.

అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీఛార్జీకి దిగింది సైన్యం. ఈ ఘటనలో 26 మందికి తీవ్ర గాయాలు అయినట్లుగా కథనాలు వస్తున్నాయి. అలాగే నలుగురు జవాన్లకు కూడా గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. 

నిరసనకారులు ఇంటిని ముట్టడించడంతో.. వారి నుంచి తప్పించుకునేందుకు రాజపక్స ఇల్లు వదిలి పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు శ్రీలంక రక్షణశాఖ వర్గాలు మీడియాకు వెల్లడించాయి.

గతంలో కూడా అప్పటి ప్రధాని మహింద రాజపక్స ఇంటిని ఆందోళనకారులు ముట్టడించటం వల్ల ఆయన కూడా ఇలాగే పారిపోయారు.

sri lanka crisis

శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన సోదరుడు మహింద రాజపక్స కారణమని ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపిస్తున్నారు.

విదేశీ మారక నిల్వలు అడుగంటడం వల్ల ఇంధనం, ఆహార ఉత్పత్తుల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో ధరలు ఆకాశాన్నంటాయి. ఇంధన కొరత కారణంగా విద్యుత్తు కోతలు అమలు చేస్తున్నారు.

శనివారం కొలంబో లో పెద్ద ఎత్తున ఆందోళలనలకు ప్రభుత్వ వ్యతిరేకవ వర్గాలు పిలుపునివ్వడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే శుక్రవారం పోలీస్ కర్ఫ్యూ విధించింది.

పశ్చిమ ప్రావిన్స్‌లోని నెగోంబో, కెలానియా, నుగేగోడ, మౌంట్ లావినియా, నార్త్ కొలంబో, సౌత్ కొలంబో, కొలంబో సెంట్రల్‌లతో కూడిన ఏడు పోలీసు డివిజన్లలో కర్ఫ్యూ విధించారు. ఈ కర్ఫ్యూ శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి తదుపరి నోటీసు వచ్చే వరకు అమలులో ఉందని ప్రకటించారు.

Related posts