telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

బిన్ లాడెన్ కుమారుడి పౌరసత్వం రద్దు చేసిన.. సౌదీ అరేబియా ..

soudi cancelled Citizenship of laden son

ఒకప్పుడు అంతర్జాతీయ ఉగ్రవాది గా ప్రపంచాన్ని వణికించిన ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. లాడెన్ కుమారుడిని పట్టించినా, ఆచూకీ చెప్పినా మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 7 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో సౌదీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన తండ్రిని చంపిన అమెరికా, దాని మిత్రదేశాలపై పగ తీర్చుకుంటామని హంజా బిన్ లాడెన్ గతంలో హెచ్చరించిన విషయం తెలిసిందే.

అల్ ఖాయిదాలో హంజా లాడెన్ ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్నాడు. 2017 జనవరిలో హంజాను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి ఆస్తులను బ్లాక్ చేసింది. సౌదీ అరేబియా సర్కారుకు వ్యతిరేకంగా సౌదీ తెగల కోసం పోరాడుతున్న హంజా పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, సిరియా దేశాలలో సంచరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనితో అతడి ఆచూకీ చెప్పినా, ఖచ్చితమైన సమాచారంతో పట్టించినా ఏడు కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నట్టు అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.

Related posts