telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

కరోనా సమయంలో నర్సులు సాహసంతో విధులు: పవన్ కల్యాణ్

pawan

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న ప్రతి నర్సుకి తన తరఫున, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. వృత్తి రీత్యా ‘నర్సు’ అయినా ఆసుపత్రిలో వారిని ‘సిస్టర్’ అని సంబోధిస్తారని అన్నారు. ఆ పిలుపుతోనే తమ కుటుంబ సభ్యులకు చేసే సేవగా నర్సులు భావిస్తారని కొనియాడారు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న ఈ సమయంలో ఆసుపత్రుల్లో, ఐసోలేషన్ వార్డుల్లో నర్సులు సాహసంతో తమ విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ వారసత్వాన్ని ఈ ‘కరోనా సమయంలో నర్సులు కొనసాగిస్తున్న తీరు సర్వదా ప్రశంసనీయమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆరోగ్య ఫలితాలను సాధించడంలో నర్సింగ్ విభాగం చాలా అవసరం అని అన్నారు.

Related posts