సేవ్ అమరావతి పేరుతో రైతులు చేపట్టిన దీక్ష 51వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా ఈరోజు రైతులు జల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సేవ్ అమరావతి, సేవ్ ఏపీ అంటూ నినాదాలు చేశారు.తాళ్లాయిపాలెం వద్ద కృష్ణా నదిలో నడుం లోతు నీటిలో మందడం రైతులు నిలబడి తమ నిరసన తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలను వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అన్ని గ్రామాల్లో పర్యటించి రైతులతో మాట్లాడాలని, రాజధాని తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.