telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

లిక్కర్ షాపులు తెరవడంతో మొత్తం ఆగమైంది: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

కరోనా కేసులు పెరగడానికి వైన్ షాపులు తెరవడమే కారణమని తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. లిక్కర్ షాపులు తెరవడంతో మొత్తం ఆగమైందని అన్నారు. మద్యం షాపులు తెరవడంతో ప్రజల్లో కరోనా భయం పోయిందన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు 45 రోజుల పాటు కొనసాగిన లాక్ డౌన్ వ్రతం సీఎం కేసీఆర్ వల్ల భంగమైందని చెప్పారు.

వైన్ షాపులు తెరవడంతో విచ్చలవిడిగా ఇళ్ల నుంచి జనం బయటకు వచ్చేస్తున్నారని చెప్పారు. పెద్ద సంఖ్యలో జనాలు పోగయ్యే వైన్ షాపులకు అనుమతించారని దుయ్యబట్టారు. లిక్కర్ పై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ప్రధానమైనప్పుడు… చిరు వ్యాపారాలు చేసుకునే వారికి వారి వ్యాపారాలే ముఖ్యమని చెప్పారు. ఒకరో, ఇద్దరో పని చేసుకునే మెకానిక్ షాపులకు అనుమతి ఇవ్వలేదని రేవంత్ విమర్శించారు.

Related posts