telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మహారాష్ట్ర జైళ్లలో ఖైదీలకు కరోనా.. 50 శాతం విడుదలకు నిర్ణయం!

Mubai jail corona

దేశవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 23 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 868 మరణాలతో మహారాష్ట్ర అల్లాడుతోంది. నిత్యం భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తుండడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా వ్యాప్తి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జైళ్లలోని సగం మంది ఖైదీలను విడుదల చేయాలని ఓ అత్యున్నత నిర్ణాయక కమిటీ తీర్మానించింది.

జైళ్లలోని 50 శాతం మంది అంటే 35,239 మంది ఖైదీలను మధ్యంతర బెయిలు లేదా పెరోల్ పై బయటికి పంపనున్నారు. ముంబయిలోని ఆర్ధర్ రోడ్ సెంట్రల్ జైల్ లో 184 మంది ఖైదీలు కరోనా బారినపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.ఏ కేటగిరీ ప్రకారం ఖైదీలను విడుదల చేస్తారనేదానిపై అత్యున్నత కమిటీ స్పష్టత ఇవ్వలేదు. 

Related posts