telugu navyamedia
సినిమా వార్తలు

స‌మంత‌ ప్రెగ్నెంట్ .. మరో సాహసం

నాగచైతన్యతో విడాకులు తరువాత టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌,హాలీవుడ్‌ అనే తేడా లేకుండా వరుస సినిమాలు చేస్తుంది. కొత్త సినిమాల్లో విభిన్న పాత్రలు చేస్తూ ప్రేక్ష‌కులను అల‌రిస్తోంది. ఇటీవ‌ల అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన పుష్ఫ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ చేసి కుర్రాకారుని చెమ‌లు పుట్టించింది.

Is Samantha Akkineni pregnant? Here's what the actress has to say

తాజాగా మరో సాహసానికి తెర‌లేప‌నుంది.  గర్భవతి పాత్రలో నటించబోతుదంట సామ్‌. ప్ర‌స్తుతం హరి మరియు హరీశ్‌ దర్శకత్వం వహిస్తున్న యశోద మూవీలో స‌మంత న‌టిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

Pregnancy Reason For Samantha Akkineni's Social Media Break?

ఈ చిత్రంలో నిస్సహాయ స్థితిలో ఉన్న ఓ ప్రెగ్నెంట్ నర్స్ పాత్రలో క‌నిపించ‌నుంద‌ని ఫిలింనగర్​లో టాక్​ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం హైదరాబాద్​లో ఆసుపత్రి సెట్​ను కూడా వేశారు. దీనిలోనే ఈ చిత్రం రెగ్యులర్​ మొదటి షెడ్యూల్​ పూర్తి అయ్యింద‌ని స‌మాచారం. మరి బేబీ బంప్ తో సామ్ ఎలా కనించనుందో చూడాలి మ‌రీ.

Related posts