telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జ‌గ‌న్ ప్రభుత్వం ఆనాలోచిత నిర్ణయానికి ఇదే నిదర్శనం..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనాతో అస్వస్థతకు గురికావడం విచారకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఆయ‌న‌ త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే డాక్టర్లు, వైద్య సహాయకులు, వైద్య విద్యార్థులతోపాటు పోలీసులు, స్థానిక సంస్థల సిబ్బంది, మీడియా ఉద్యోగులు అధిక సంఖ్యలో క‌రోనా బారినపడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయవేత్తలు కూడా కోవిడ్ బారినపడుతుండడం దీని తీవ్రతను తెలియచేస్తోంది.

N Chandrababu Naidu seeks Governor's intervention to restore law and order,  democracy - The Economic Times

ప్రస్తుత పరిస్థితులలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు మరింత అప్రమత్తతతో కోవిడ్ నివారణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. కోవిడ్ పరీక్షలు పెంచడం ద్వారా వైరస్ సోకినవారిని గుర్తించి వైద్యం చేసే అవకాశం కలుగుతుంది. ఇందుకోసం కరోనా పరీక్ష కేంద్రాలను పెంచాలని, మొబైల్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి వేళ కర్ఫ్యూ, సమావేశాలు, వేడుకలపై పాక్షిక నిషేధాలు ఉన్నప్పటికీ పాఠశాలల్లో తరగతుల కొనసాగింపు ఇప్ప‌డున్న ప‌రిస్థితుల్లో స‌రికాద‌ని అన్నారు. కోవిడ్ ఉధృతి తగ్గే వరకు తరగతులను వాయిదా వేయాల‌ని కోరారుపిల్లలకు వాక్సినేషన్ పూర్తికాకపోవడం, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం వంటి అంశాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవలసిందిగా వైసీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా చెప్పారు.

ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మద్యం దుకాణాలు మరో గంటపాటు అదనంగా తెరిచి ఉంచాలని వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం ఈ ప్రభుత్వ ఆనాలోచిత నిర్ణయానికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ సమయంలో ప్రజలకు నిత్యావసరాలు ఎలా ఇవ్వాలి, వైద్య సేవలు ఎలా మెరుగుపరచాలని కాకుండా మద్యం అమ్మకాలపై దృష్టి పెట్టడం ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు.

In two years of Jagan government, ACB gave 'special care' to TDP - The  Federal

ప్రజలందరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని, మాస్క్‌ లేకండా బయటకు రాకండి అని పవన్‌ కోరారు. భౌతిక దూరం పాటించండి. పిల్లల విషయంలో అప్రమత్తత పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.

టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా సోకిన విష‌యం తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన విషయాన్ని చంద్రబాబు నాయుడు మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. దీంతో ఆయన ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

Related posts