telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా ప్రేమ తెలియాలంటే నువ్వు నాలా మారిపోవాల్సిందే

నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలియాలంటే నువ్వు నాలా మారిపోవాల్సిందే. 100 ఏళ్లు వచ్చినా నువ్వు నా బేబీవే. నా జీవితంలో నువ్వు ఉండటం అదృష్టంగా భావిస్తున్నా. హ్యాపీ బర్త్‌ డే మంకీ’’ అంటూ హీరోయిన్‌ సాయిపల్లవి తన సోదరి పూజా కన్నన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం పూజా పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో చిన్ననాటి ఫొటో షేర్‌ చేసి తన ప్రేమను చాటుకున్నారు. కాగా ఫిదాతో కుర్రకారు మనసు దోచిన సాయి పల్లవి ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా పడింది. ఇక ఈ చిత్రంతో పాటు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో రూపొందిన ‘విరాటపర్వం’లోనూ సాయి పల్లవి నటిస్తున్నారు.

Related posts