telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్ ఒక్క‌డే రియ‌ల్ మెగాస్టార్‌..

వివాద‌స్ప‌ద డైరెక్ట‌ర్ రామ్‌గాపాల్ మెగా ఫ్యామిలీని విమర్శించడానికి ఏ చిన్న అవకాశం దొరికిన వ‌ద‌ల‌డు. తనదైన శైలిలో ట్వీట్ వదిలిన వర్మ.. అల్లు అర్జున్‌ని పొగుడుతూ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లతో సహా మెగా ఫ్యామిలీ పై మ‌రోసారి కామెంట్స్ చేశాడు. తన మనసుల ఏముందో నిర్మొహమాటంగా చెప్పడం ఆయ‌న పెట్టిన విద్య‌.

Mega Family Celebrated Rakhi Festival and Chiranjeevi Birthday - Photogallery - Page 1

తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు, రాఖి పౌర్ణమి రెండు పండగలు ఒకేసారి రావటంతో మెగా ఫ్యామిలీ అంత ఒకేచోట చేరి మెగా సెలబ్రేషన్స్ జ‌రుపుకున్నారు . మెగా హీరోలు అంద‌రూ సందడి చేయగా అల్లు ఫ్యామిలీ నుండి అల్లు అర్జున్ మాత్రం కనిపించకపోవటం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

Chiranjeevi celebrates birthday with family and fans. Allu Arjun gives it a miss - Movies News

మెగాస్టార్ ఇంట్లో అంతపెద్ద ఈవెంట్ కి అల్లు అర్జున్ రాకపోవటం ఏంటి, అంత ఓకే నేనా అంటూ సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు. ఒకవేళ బన్నీ షూటింగ్ లో బిజీగా ఉంటే కనీసం భార్య స్నేహ అయినా హాజరవ్వాలిగా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంద‌రు.

Telugubit on Twitter: "#Chiranjeevi Birthday celebrations #HBDMegastarChiranjeevi #GodFather #BholaShankar #MegastarChiranjeevi #MEGA154… "

ఇంతలో సందు దొరికితే చాలు దూరిపోదాం అన్న‌ రామ్ గోపాల్ వర్మ. మెగా హీరోలందరి పరువు తీస్తూ బన్నీనే రియల్ మెగాస్టార్ అని స్టేట్మెంట్ ఇచ్చేసాడు . చిరంజీవి అండదండ కోరుకుంటున్న హీరోలుగా మెగా హీరోలని తీసిపడేశాడు వర్మ. అయితే కమెడియన్ అల్లు రామలింగయ్య ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు అర్జున్ మెగా అండ కోరుకోవటం లేదని, అతనొక సెల్ఫ్ మేడ్ స్టార్ అని వర్మ ట్వీట్ చేశాడు.

Pawan Kalyan At MegaStar Chiranjeevi Birthday Celebrations - Suman TV

అంతేకాదు..మెగా వారసులందరితో పోల్చితే ఒక్క అల్లు అర్జున్ మాత్రమే రియల్ మెగా సక్సెస్ అందుకున్నారని వర్మ పేర్కొన్నారు. మెగా వేడుకలకు అటెండ్ కాకపోవడం అనేది అల్లు అర్జున్ తెలివితేటలకు నిదర్శనం అని.. తానూ మెగా హీరోల్లా డిపెండ్ అయ్యే హీరోని కాదని అందరికి తెలిసేలా కావాలనే బన్నీ మెగా పార్టీకి డుమ్మా కొట్టాడని వర్మ కామెంట్స్ చేశాడు.

Pawan Kalyan, Chiranjeevi Konidela Raksha Bandhan Celebrations 2021 Picture Gallery - Sakshi

Related posts