telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

మరో క్రేజీ చాన్స్ లో .. నభా నటేష్..

Nabha-Natesh

ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ క్రేజీ చాన్స్ దక్కించుకుంది. కాస్త లేట్ అయినా.. వరుసగా అవకాశాలు పట్టేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మెగా హీరో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇంతకీ నభా నటేష్ ఏ మెగా హీరోతో నటిస్తుందో తెలుసా..? కన్నడ బ్యూటీ నభా నటేష్ సైలెంట్ గా ఛాన్స్ ల మీద ఛాన్సులు పట్టేస్తోంది. సుధీర్ బాబు హీరోగా నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు లేటెస్టుగా ఇస్మార్ట్ సంకర్ చిత్రంతో బంపర్ హిట్ దక్కించుకుంది. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బంపర్ హిట్ దక్కించుకుంది. ఇస్మార్ట్ సంకర్ లో అందాల విందు చూసిన ఆడియన్స్ గోవా బ్యూటీ ఇలియానా లేని లోటు తీరుస్తుందంటున్నారు. యూత్ అయితే నభాను జూనియర్ ఇలియానా అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.

జూనియర్ ఇలియానా అనే ట్యాగ్ లైన్ కు తగ్గట్టే మాస్ అప్పీల్ లో ఈ జనరేషన్ హీరోయిన్స్ లో తనను కొట్టేవాళ్లు లేరని నభా నటేష్ నిరూపిస్తోంది. గ్లామర్ ఎలివేషన్.. ఎక్స్ పోజింగ్ లో నభా ఏ మాత్రం మొహమాటం లేకుండా యూత్ కి ట్రీటిస్తోంది. అందుకే ఈ అమ్మడికి ఒకదాని వెంట ఒకటిగా అవకాశాలు క్యూకడుతున్నాయి. రీసెంట్ గా ఈ బ్యూటీని మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో నటించే క్రేజీ ఛాన్స్ అందుకుంది. నభా నటేష్ ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ సరసన డిస్కో రాజా చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా గల్లా అశోక్ హీరోగా పరిచయం అవుతున్న సినిమాలో సైతం హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు తాజాగా మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టింది. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నభా నటేష్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. అమ్మడు జోరు చూస్తుంటే మరో బ్లాక్ బస్టర్ పడితే క్రేజీ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోవడం ఖాయం.

Related posts