telugu navyamedia
సినిమా వార్తలు

పూరీ దర్శకత్వంలో “ఫైటర్”గా విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda

సెన్సేషనల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ “అర్జున్ రెడ్డి” సినిమాతో తెలుగుతోపాటు అన్ని భాష‌ల్లోనూ క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం “డియర్ కామ్రేడ్”. ఈ చిత్రం ఇటీవలే నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లో విడుదలైన మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. తాజాగా విజయ్, డాషింగ్ డైరెక్టర్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్‌’తో సూపర్ హిట్ అందుకున్న పూరీ ఓ సూపర్ క్రేజీ పాత్రను విజయ్ కోసం డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ ఆ పాత్రలో అలరించనున్నారని టాక్. సరిగా పలకలేని వ్యక్తిగా నటించనున్నాడని టాక్. ఈ విషయాన్ని ఛార్మి అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన జాన్వీ కపూర్ ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి “ఫైటర్” అనే టైటిల్ ఖ‌రారు చేసాడట పూరీ. తాను రాసుకున్న కథకు ఇది అయితేనే పక్కాగా సరిపోతుందని భావిస్తున్నాడు ఈయన. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రాంతి మాధవ్ సినిమా తర్వాత పూరీ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావడంతో విజయ్ కూడా పూరీ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ప్రస్తుతం లొకేషన్స్ వేటలో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. పూరీ జగన్నాథ్ తోడుగా విజయ్ దేవరకొండ కూడా లొకేషన్స్ కోసం తిరుగుతున్నాడు.

Related posts