telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జెమినీ గణేషన్ కు జమున వార్నింగ్… సంచలన వ్యాఖ్యలు

jamuna on her biopic

సీనియర్ నటీమణి జమున ఈ మధ్యే ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 1950ల కాలం నాటి  సంచలన విషయాలు బయట పెట్టింది. అప్పట్లో పరిస్థితులు ఇలా ఉండేవి కావని.. హీరోయిన్లకు చాలా మర్యాద ఇచ్చేవారని చెప్పింది ఈమె. అప్పట్లో తెలుగులో ఇతర భాషా హీరోలు కూడా నటించేవారని.. అందులో జెమినీ గణేషన్ కూడా ఉన్నారని చెప్పింది జమున. సావిత్రితో ఎక్కువ సినిమాలు చేసిన జమున.. ఆమెతో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకుంది. ఆమె పెళ్లి జరిగిన విషయాన్ని కూడా తమకు ఎవరికీ చెప్పలేదని.. జెమినీతో క్లోజ్‌గా ఉండటాన్ని చూసి తామే అర్థం చేసుకున్నామని చెప్పింది జమున. తమిళ మిస్సమ్మ 100 రోజుల వేడుకలో సావిత్రితో జెమినీ చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యాడని.. ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని మాట్లాడినపుడే పెళ్లి చేసుకున్నారనే విషయం తమకు కూడా అర్థమైపోయిందని చెప్పారు జమున. అదే సమయంలో జెమినీ తన దగ్గరికి వచ్చి.. భుజంపై చేయి వేసి మాట్లాడాడని.. అప్పుడే తనకు కోపం వచ్చి నేనేం సావిత్రిని అనుకుంటున్నావా ? అంటూ వార్నింగ్ ఇచ్చానంటూ నాటి సంగతులు గుర్తు చేసుకుంది జమున. సావిత్రి జీవితం అలా నాశనం అయిపోడానికి జెమినీ గణేషన్ కారణం అంటూ సంచలన విషయాలు బయటపెట్టింది ఈమె. కొన్ని విషయాలు సావిత్రికి చెప్పినా కూడా అర్థం చేసుకోలేదని.. ఎవరి ఖర్మకు ఎవరు మాత్రం బాధ్యులు అంటుంది ఈ సీనియర్ నటీమణి.

Related posts