telugu navyamedia
సినిమా వార్తలు

అమెజాన్ ప్రైమ్ లో టాప్ 10 చిత్రంగా ‘ఏకమ్‌’

క‌రోనా కార‌ణంగా థియేటర్లలో రిలీజ్‌కు నోచుకోని చిన్న చిత్రాల‌ను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఇప్పటికే పలు చిన్న చిత్రాలు ఓటీటీలో విడుదలై.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

తాజాగా మరో చిన్న చిత్రం ‘ఏకమ్‌’ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలై విజయవంతంగా దూసుకెళుతోంది. వరుణ్ వంశీ.బి”ని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం “ఏకమ్”. “ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్” అన్నది ఉప శీర్షిక.

అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 29 న విడుదలై ప్రేక్షకుల ఆదరణతోపాటు విమర్శకుల ప్రశంసలు కూడా దండిగా పొందింది.

అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన “ఏకమ్” కేవలం పది రోజుల్లో టాప్-10లో స్థానం సంపాదించుకుని అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా… తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన “ఏకమ్” చిత్రానికి అమెజాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ చిత్రాన్ని ప్రేక్షకులంతా ఏకగ్రీవంగా ఆదరిస్తుండడం చాలా సంతోషాన్నిస్తోంది. మా నిర్మాతల పెట్టుబడిని సేఫ్ గా వెనక్కి తెస్తుండడంతోపాటు… దర్శకుడిగా నాకు రెండో సినిమా వచ్చేలా చేసింది. ప్రస్తుతం అమెజాన్ లో టాప్ 10లో ఉన్న “ఏకమ్” అతి త్వరలో మొదటి రెండు మూడు స్థానాల్లో సగర్వంగా నిలుస్తుందనే నమ్మకం మాకుంద‌ని చిత్రదర్శకుడు వరుణ్ వంశీ అన్నారు.

Eakam (2021) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

Related posts