ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. టక్ జగదీష్, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పాటు ఈ ఏడాది చివరికి ఓ వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. అయితే నేని ఇప్పుడు తన తాజా చిత్రం టక్ జగదీష్ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రాన్ని శివ నిర్వానా దర్శకత్వంలో సాహు గారిపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫ్యామిలీ, రొమాన్స్ జానర్స్‌లో తెరకెక్కుతోంది. ఇందులో జగపతి బాబు, రావు రమేష్, నాజర్, ప్రవీన్, ఐశ్వర్య రాజేష్, రోహిని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది. నాని టక్ జగదీష్ సినిమా ట్రైలర్ ఎప్పుడు విడుదల కానుందో చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల 13న ఈ సినిమా ట్రైలర్ రానున్నట్లు చిత్రబృందం ఓ పోస్టర్ ను విడుదల చేస్తూ తెలిపింది. ఇక వేసవి కానుకగా ఏప్రిల్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉండనుంది అనేది.
previous post