telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పైలెట్ రోహిత్ విషయం లో మర్రి శశిధర్ రెడ్డి సీరియస్…

Congress Marri Shashidar reddy L&T

తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన ఫేక్ అఫిడవిట్… గ్రాడ్యుయేట్ కాకపోయినా దొంగ ఓటు నమోదు చేసుకొని ఓటేశాడు అని శశిధర్ రెడ్డి అన్నారు. స్వీడన్ లో డిగ్రీ పూర్తి చేసినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇంటర్మీడియట్, బీటెక్, ఎమ్.ఎస్ అంటూ పూటకొక మాట మాట్లాడుతున్నారు. వెబ్ సైట్ లో యూఎస్ లో ఎమ్.ఎస్ చేసినట్లు పెట్టుకున్నారు. మోసాలు చేయడం రోహిత్ కు అలవాటుగా మారింది. ప్రజలను మోసం చేశాడు. తప్పుడు అఫిడవిట్ పై సీరియస్ చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశాం. రోహిత్ మోసంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని శశాంక్ గోయల్ ను కోరాం. కలెక్టర్ ను విచారణ చేయాల్సిందిగా ఆదేశిస్తామని చెప్పారు. ఫేక్ సర్టిఫికెట్ ల ముఠాలో రోహిత్ హస్తం ఉందనే అనుమానం కలుగుతుంది. డీజీపీ విచారణ జరిపించాలి. రోహిత్ ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలి అని పేర్కొన్నారు. ఈ విషయంలో గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తాం. ప్రజాస్వామ్యాన్ని బతికించాల్సిన ఎన్నికల సంఘం.. తమ బాధ్యతను నిర్వర్తించాలి. రోహిత్ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలుస్తాం అని తెలిపారు. అయితే చూడాలి మరి ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.

Related posts