telugu navyamedia
రాజకీయ సామాజిక

మిస్‌ యూనివర్స్‌గా భారత యువతి..

మిస్ యూనివర్స్ 2021 కీరిటాన్ని భారతీయ యువతి  హర్నాజ్ సంధు సొంతం చేసుకుంది.
దీంతో 21 ఏళ్ల తర్వాత మిస్ యూనివర్స్ కిరీటం గెలుపొందిన భారతీయురాలిగా సంధు రికార్డు నెలకొల్పింది. చివరిసారిగా లారా దత్తా 2000లో మిస్ యూనివర్స్‌ టైటిల్‌ను గెలుపొందింది.

ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరం జరిగిన 70వ మిస్ యూనివర్స్ పోటీల్లో 80 దేశాల నుంచి భామలు పాల్గొనగా.. వీరందరినీ వెనక్కినెడుతూ విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. 1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్‌కౌర్ మిస్‌ యూనివర్స్‌గా ఎంపికయ్యారు.

Image

విజేతగా నిలిచిన హర్నాజ్ సంధూకు గతేడాది మిస్ యూనివర్స్ మెక్సికో భామా అండ్రాయి మెజా కిరీటాన్ని అలంకరించారు. ఈ పోటీల్లో పరాగ్వేకు చెందిన నదియా ఫెరీరా ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, దక్షిణాఫ్రికాకు చెందిన లాలెలా మస్వానే రెండో రన్నరప్‌గా నిలిచారు. ఫిలిప్పీన్స్‌కు చెందిన బీట్రైస్ గోమెజ్ ఈ పోటీలో టాప్ 5లో నిలిచింది.హర్నాజ్ ఫైనల్‌లో షో-స్టాపర్‌గా నిలిచింది. టాప్ 10 నుండి టాప్ 3కి చేరుకుంది. చివరకు విజేతగా నిలిచింది హర్నాజ్.

ఇజ్రాయెల్‌లో జరుగుతున్న ఈవెంట్‌లో అందాల రాణి గౌరవనీయమైన టైటిల్‌ను గెలుచుకున్న వార్తను ప్రకటించారు.. “కొత్త మిస్ యూనివర్స్ ఈజ్…ఇండియా,” అంటూ క్లిప్‌కి క్యాప్షన్ ఇస్తూ మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు.

Image

హర్నాజ్ సంధు.. పంజాబీ కుటుంబంలో 2000 సంవత్సరంలో జన్మించింది.  శివాలిక్‌ పబ్లిక్‌ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసింది. ప్రస్తుతం పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేస్తోంది. ఓ వైపు అందాల పోటీల్లో పాల్గొంటూనే మరోవైపు చదువు కొనసాగిస్తోందీ 21ఏళ్ల అమ్మడు.

India's Harnaaz Sandhu crowned Miss Universe 2021

కాలేజీలో తొలి స్టేజ్‌ ప్రదర్శనతో తన మోడలింగ్‌ లో జర్నీ మొదలు పెట్టింది. 17 ఏళ్లకే మోడలింగ్‌ రంగంలో అడుగు పెట్టింది. అనంతరం అందాల పోటీల్లో పాల్గొని 2017లో ‘మిస్‌ చంఢీఘర్‌’ కిరీటాన్ని గెలుచుకుంది. 2019లో ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ కోసం పోటీ పడి టాప్‌ 12 జాబితాలో నిలిచింది.

స్వతహాగా నటి అయిన ఈమె.. యారా దియాన్ పో బరన్, బై జీ కుట్టంగే అనే పంజాబీ సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించింది.

Related posts