telugu navyamedia
రాజకీయ వార్తలు

వాజ్‌పేయీ అందరికీ ఆదర్శంగా నిలిచారు: రాష్ట్రపతి

మాజీ ప్రధాని వాజ్‌పెయీ అందరికీ ఆదర్శంగా నిలిచారని రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ అన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో వాజ్‌పెయీ చిత్రపటాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ…వాజ్‌పేయీకి భారతరత్న ఇచ్చి ప్రభుత్వం గౌరవించిందన్నారు.

వాజ్‌పేయీ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. విలక్షణ వ్యక్తిత్వంతో వాజ్‌పేయీ అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. వాజ్‌పేయీ గడిపిన సాధారణ జీవితం అందరికీ ఒక పాఠం నేర్పిందని, రాజకీయవేత్తగా, కవిగా, అసాధారణ ప్రతిభావంతుడిగా అందరిపై ప్రభావం చూపారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఆయన చూపిన రాజనీతజ్ఞత అసమానం. అణుపరీక్ష, కార్గిల్‌ యుద్ధం వంటి కీలక ఘట్టాలు ఆయన దైర్యానికి ప్రతీకలని కొనియాడారు.

Related posts