telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 13, సోమవారం రాశిఫలాలు

మేషరాశి..

బంధువులతో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత చాలా అవసరం. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆటంకాలు ఎదురవకుండా చూసుకోవాలి.

వృషభరాశి..

ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా పై అధికారుల నుంచి గుర్తింపు ఉండదు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఏర్ప‌డుతుంది.వృత్తి వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి..

మిథునరాశి..

విద్యార్థులకు ఏకాగ్రత లోపం వల్ల ఇబ్బందులకు గురవుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. వాహనయోగం క‌లుగుతుంది. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలిస్తాయి.

కర్కాటకరాశి..

మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడికి లోనవకుండా, ఓర్పుగా వ్యవహరించండి. దూరప్రయాణాలు చేస్తారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహరాశి..

వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమంచి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణయత్నాలు చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సివ‌స్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఏర్ప‌డ‌తాయి.

కన్యరాశి…

కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత కలదు. స‌మాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో వెనకడుగు వేయడం మంచిదికాదు. ఆప్తుల నుంచి తీపి క‌బురు వింటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి ఏర్ప‌డ‌తుంది.

తులరాశి..

కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మారతారు. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం క‌లుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు వ‌స్తాయి. రాజకీయనాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. .

వృశ్చికరాశి..

వ్యాపార ఒప్పందాలు, స్థిరాస్తుల కొన‌డం అమ్మ‌డంలో పెద్ద‌ల‌ సలహా తీసుకోవటం ఉత్తమం. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి అభివృద్ది ఏర్ప‌డుతుంది. కుటుంబంలో అనుకోని కొన్ని సమస్యలు ఏర్ప‌డ‌తాయి. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం బారిన ప‌డ‌తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఎదుర‌వుతాయి.

ధనుస్సురాశి..

రాబడికి మించి ఖర్చులు అధిక‌మ‌వుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ల‌భించ‌దు. బంధుల‌తో తగాదాలు ఏర్ప‌డ‌తాయి. ఇంటాబయటా సమస్యలు నెల‌కొంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు త‌లెత్తే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

మకరరాశి…

కొత్త పనులు చేపడతారు. రాజకీయనాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వాహనాలు కొంటారు. దైవదర్శనాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు సంతృప్తినిస్తాయి.

కుంభరాశి..

కుటుంబంలో ఒత్తిడులు. మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్ట‌మైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాటాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి ల‌భిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలలో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు నెల‌కొంటాయి.

మీనరాశి..

రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ఆధ్యాత్మిక, ఆరోగ్య విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి ల‌భిస్తుంది.

Related posts