telugu navyamedia
రాశి ఫలాలు

దిన ఫలితాలు : జూన్ 11 మంగళవారం రాశిఫ‌లాలు.

మేషరాశి..

నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు మరింత చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభరాశి..

సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మిథునరాశి..

రాజకీయ సంబంధిత సభ సమావేశాలు హాజరవుతారు. చేపట్టిన పనులలో అప్రయత్న విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కర్కాటకరాశి..

నూతన వస్తు వస్త్రా లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు అంచనాలు అందుకుంటారు.

సింహరాశి..

చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. చేపట్టిన పనులలో అవరోధాలు తప్పవు. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు నిరాశ కలిగిస్తాయి.

కన్య రాశి..

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారపరంగా ఊహించిన వివాదాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలికఋణ ఒత్తిడి పెరుగుతుంది.

తులరాశి..

సోదరుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు పరిచి లాభాలను అందుకుంటారు.

వృశ్చికరాశి..

చేపట్టినపనులు మధ్యలో నిలిపివేస్తారు. సోదరులతో ఒక ముఖ్య విషయమై వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

ధనుస్సురాశి..

స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.

మకరరాశి..

నూతన ఋణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ఊహించని ప్రయాణం సూచనలు ఉన్నవి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కుంభరాశి..

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారపరంగా ఆప్తుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు.

మీనరాశి..

ఆర్థికంగా మరింత పుంజుకుంటారు. నిరుద్యోగులకు చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలు అందుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు.

Related posts