telugu navyamedia
CBN pm modi ఆంధ్ర వార్తలు నరేంద్ర మోదీ రాజకీయ వార్తలు

చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు

ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు  విజయవాడ కేసరపల్లి ఐటీ పార్కు వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగనుంది.

ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ మోదీ బుధవారం ఉదయం 8.20 గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏపీ సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొంటారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

అతిథుల కోసం విజయవాడలోని పెద్ద హోటళ్లలో గదులు బుక్ చేశారు.

దాదాపు 10 వేల మంది పోలీసులను ఈవెంట్ బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. ఎస్పీజీ బృందం విజయవాడలో స్థానిక పోలీసులతో కలసి భద్రతను సమన్వయం చేసుకుని సెక్యూరిటీ పటిష్టం చేశారు.

Related posts