telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

నేడు సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష..వీటిపైనే చర్చ

Kcr telangana cm

సీఎం కేసీఆర్‌ వరుస సమీక్షలతో దూకుడు పెంచారు. ఇప్పటికే దుబ్బాక, ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌..ఇప్పుడు యాసంగి పంటలపై దృష్టి సారించారు. పంటలను విక్రయించడంలో రైతులు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోవద్దని భావిస్తున్న సీఎం కేసీఆర్‌… వరుస సమీక్షలతో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో.. యాసంగి పంటసాగు విధానం, పంట కొనుగోలుపై రివ్యూ చేయనున్నారు.
వేసవిలో పండిన పంటల్ని గ్రామాల్లోకే వచ్చి రైతుల దగ్గర ప్రతిగింజనూ కొనుగోలు చేస్తామని ప్రకటించిన కేసీఆర్‌.. ఆ దిశగా రివ్యూలతో అధికారులను అలర్ట్‌ చేస్తున్నారు. యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణీత పంట సాగు విధానం, గ్రామాల్లోనే పంట కొనుగోలుపై సీఎం ఇవాళ మధ్యాహ్నం మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రగతి భవన్‌లో ఈ రోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఈ సమీక్ష జరగనుంది. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొంటారు. యాసంగిలో ఏ పంట వేయాలి..? ఏ పంట వేయొద్దు..? ఏ పంట వేస్తే కలిగే ఎలాంటి లాభనష్టాలు ఉంటాయ్‌..? అనే విషయాలపై.. సీఎం కేసీఆర్‌ అధికారులతో చర్చించనున్నారు.
రాష్ట్రంలో మక్కల సాగుపైనా సమీక్ష చేయనున్నారు కేసీఆర్‌. కరోనా కారణంగా గత యాసంగి పంటలను గ్రామాల్లో కొనుగోలు చేసినట్టుగానే… వర్షాకాలం పంటలను కూడా గ్రామాల్లో కొనే విషయంపై సీఎం చర్చించనున్నారు. ఆరువేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి… రైతులకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా పంట కొనాలని ఇప్పటికే అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

Related posts