telugu navyamedia
రాజకీయ వార్తలు

యువ ఆటగాళ్లకు మంచి అవకాశం: కోచ్ రవిశాస్త్రి

ravi shastri coach

ప్రస్తుతం న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న టీమిండియా త్వరలో టెస్టు సిరీస్ ఆడనుంది. రెండు టెస్టుల సిరీస్ నేపథ్యంలో కీలక ఆటగాళ్లు గాయాలపాలవడం మేనేజ్ మెంట్ ను కలవరానికి గురిచేస్తోంది. రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్ గాయాల కారణంగా తప్పుకున్నారు. దీనిపై కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ప్రధాన ఆటగాళ్లు లేకపోవడం లోటుగానే భావిస్తున్నామని తెలిపారు. యువ ఆటగాళ్లు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

ఇషాంత్ శర్మ జట్టులో ఉంటే ఇతర ఆటగాళ్లపై పెద్దగా భారం పడదని, న్యూజిలాండ్ లో ఫాస్ట్ పిచ్ లపై భువనేశ్వర్ అన్ని ఫార్మాట్లలో ఉపయోగపడేవాడని వివరించాడు. రోహిత్ శర్మదీ ఇదే పరిస్థితి అని, దురదృష్టవశాత్తు గాయపడి టెస్టు సిరీస్ కు దూరమయ్యాడని శాస్త్రి విచారం వ్యక్తం చేశాడు. అయితే, శుభ్ మాన్ గిల్, పృథ్వీ షా వంటి ఆటగాళ్లు రాణిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

Related posts