telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

కాంగ్రెస్ సీనియర్ నేత .. వైరిచర్ల కిశోర్ .. టీడీపీలోకి, ముహూర్తం ఖరారు..

congress senior leader into tdp on 24th

కాంగ్రెస్ పార్టీ నుండి మరో సీనియర్ పార్టీ వీడుతున్నారు. గతంలో కేంద్ర మంత్రి గా ఉన్న వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఆ పార్టీ నుండి వైదొలుగుతున్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైనట్టు సమాచారం. లౌకికవాదం లేకుండా సామ్యవాద సిద్ధాంతాలను మరిచి ప్రధాని పాలన సాగిస్తున్నారని కిశోర్ ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉందని.. దాని కోసం తెలుగుదేశం పార్టీ సరైనదని తాను నిర్ణయించుకున్నట్లు కిశోర్ చంద్రదేవ్ స్పష్టం చేశారు.

ఈ నెల 24న టీడీపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో తెలుగుదేశం పార్టీ సహకారంతోనే గెలిచానని, ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని చంద్రదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీటు కావాలని భావించి ఉంటే తాను 2014లోనే పార్టీ మారేవాడినని స్పష్టం చేశాడు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుటుంబం, మా కుటుంబం ఎప్పుడూ సన్నిహితంగానే మెలిగే వాళ్లమని, మరోసారి అశోక్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించిందని కిశోర్ హర్షం వ్యక్తం చేశారు.

Related posts