telugu navyamedia
సినిమా వార్తలు

59 సంవత్సరాల “ప్రమీలార్జునీయము”

నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన పౌరాణిక చిత్రం యస్.ఆర్.మూవీస్ వారి “ప్రమీలార్జునీయము” 11–06–1965 విడుదలయ్యింది.

నిర్మాతలు ఆదిబాబు,నాగమణి లు యస్.ఆర్.మూవీస్ బ్యానర్ పై ఎం.మల్లికార్జునరావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రాన్ని కి కథ,మాటలు,పాటలు: పింగళి నాగేంద్రరావు, స్క్రీన్ ప్లే: ఎం. మల్లిఖార్జునరావు, సంగీతం: పెండ్యాల, ఛాయా గ్రహణం(ఫోటోగ్రఫీ): రవికాంత్ నగాయిచ్, కళ: గోఖలే, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, హీరాలాల్,. కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం అందించారు.

ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, బి.సరోజాదేవి, కాంతారావు, రాజశ్రీ, రేలంగి, శోభన్ బాబు, పద్మనాభం, గిరిజ, వాణిశ్రీ, మిక్కిలినేని, ఛాయాదేవి, ఋష్యేంద్రమణి, మీనాకుమారి, తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల గారి స్వరకల్పనలో పాటలు
“సరికొత్త కన్నెనోయి చొర వింత కూడదోయి”
“ఓహో మనోఙ్ఞ సుందరి మాట మాట, అతి ధీరవేగాని అపురూప రమణివే”
“నిను చూసీ చూడగనే పరవశము, నిను వీడి వీడగనే విరహము”
“జయహే ఆదిశక్తి జయహే సర్వశక్తి”
వంటి పాటలు,

“ప్రణయ సౌగంధికం నిత్య పరిమళమ్ము,”
“నిను నీ సిగ్గులే ముంచివేయు కొలదిన్”
వంటి పద్యాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారు అర్జునుడు గాను ప్రమీల గా బి.సరోజాదేవి నటించారు. ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని పలుకేంద్రాలలో అర్ధశతదినోత్సవాలు (50 రోజులు) జరుపుకుని విజయవాడ తో పాటు మరికొన్ని కేంద్రాలలో 10 వారాలు ప్రదర్శింపబడింది…

Related posts