telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“నరుడి బ్రతుకు నటన”… సితార ఎంటెర్టైన్మెంట్స్ కొత్త సినిమా

NBN

‘భీష్మ’ సినిమాతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్‌గా ఈ చిత్రం రూపొందనుంది. వీరిద్దరూ కలసి నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ హీరోతో మరో హిట్ కొట్టడానికి సితార ఎంటర్‌టైన్మెంట్స్ సన్నద్ధమవుతోంది. ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఈ చిత్రానికి ‘నరుడి బ్రతుకు నటన’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అంతేకాదు, ఈ చిత్రానికి సంబంధించిన ఒక ప్రచార చిత్రాన్ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ప్రచార చిత్రాన్ని నిశితంగా గమనిస్తే.. సంగీతానికి ఈ సినిమా కథకు సంబంధం ఉందన్నట్లు అర్థమవుతోంది. హెడ్‌ఫోన్స్, హృదయం రూపంలో ఓ జంట లోకాన్ని మరచిపోయి దగ్గరగా ఉండటం కనిపిస్తోంది. దీన్ని బట్టి ఇది కూడా ప్రేమకథా చిత్రమేనని స్పష్టమవుతోంది.

Related posts