telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఉపాసనకు కొత్త వంటకాన్ని పరిచయం చేసిన సమంత

Sam

ఉపాసన ప్రారంభించిన URLife.co.in అనే వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆరోగ్య చిట్కాలు, పౌష్టికాహారం తయారు చేసుకోవడం తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. మానసిక, భావోద్వేగాల సమతుల్యత లాంటి తాను గాఢంగా నమ్మే కొన్ని సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా URLife.co.in వెబ్ సైట్ ఏర్పాటు చేశామని ఉపాసన తెలిపింది. ‘యువర్ లైఫ్’ వెబ్ పోర్టల్‌ ద్వారా కొత్త కొత్త రెసిపీలను వ్యూయర్స్‌కు పరిచయం చేస్తున్నారు. ‘స్పైసప్ యువర్ లైఫ్ విత్ సామ్’ సెక్షన్‌లో హెల్దీ అండ్ టేస్టీ వంటలతో ఆమె మంచి చెఫ్ అనిపించుకుంటున్నారు. తాజాగా ఉపాసన, సమంత కలిసి ‘స్పైసప్ యువర్ లైఫ్ విత్ సామ్’లో సమంత వేగాన్ ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ పుడ్డింగ్ చేశారు. ఇందుకు కొబ్బరి పాలు, డార్క్ కొకోవా పొడి, ఫిల్టర్ కాఫీ డికాక్షన్, వెనీలా, మాపుల్ సిరప్ లేదా బెల్లం సిరప్, సబ్జా గింజలను కలిపి రాత్రంతా ఫ్రిజ్‌లో పెట్టడం ద్వారా చాలు సులువైన రుచికరమైన రెసిపీ తయారవుతుందని చెబుతూ.. ఈ రెసిపీ గురించి తెలిపారు సమంత. మరుసటి రోజు ఫిల్టర్ కాఫీ చాక్లెట్ చియా సీడ్ రుచి చూడటం ప్రారంభించి గ్లాస్‌లో ఉన్న ఫుడ్డింగ్ మొత్తం తినేసే వరకు ఆపలేదు సమంత. అంత రుచిగా ఆమెకు నచ్చిందా రెసిపీ. ఈ సందర్భంగా ఉపాసనతో మాట్లాడుతూ.. తాను ప్యూర్ వెజిటేరీయన్ అని తెలిపింది సమంత.

Related posts