తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్ రాజీనామా చేశారు. దీనితో కడప జిల్లాలో అధికార టీడీపీకి షాక్ తగిలినట్టయింది. గతంలో రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన సాయిప్రతాప్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణానంతరం కొన్నాళ్లు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ అక్కడ ఇమడలేకపోతున్నారన్న వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో కొన్నాళ్ల క్రితం జగన్ డైనమిక్ లీడర్ అంటూ ప్రశంసించి ఊహాగానాలకు తెరలేపారు. నిత్యం జనంలో ఉండేలా జగన్ ప్రణాళికలు రూపొందించుకుంటున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడంతో త్వరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జగన్ గారూ మీరు ఏపీకి సీఎం.. సాక్షి పేపర్ చదవడం మానేయండి?: నారా లోకేశ్