telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు: ప్రిన్సిపల్ సెక్రటరీ

AP

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని కొందరు వ్యక్తులు పనిగట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నిర్వహించే వ్యక్తులపై తాము చట్టపరంగా ముందుకెళతామనీ ప్రకటనలో పేర్కొన్నారు.

కొందరు వ్యక్తులు ఏషియన్ పల్ప్ అండ్ పేపర్(ఏపీపీ) అనే సంస్థ రాష్ట్రం నుంచి పెట్టుబడులను తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతిరహిత విధానాలను పాటిస్తూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రిన్సిపల్ సెక్రటరీ తెలిపారు.

Related posts