telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రతీ నియోజకవర్గంలో సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌: కేటీఆర్‌

ktr trs president

 తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ నాయకులతో కేటీఆర్‌ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ నియోజకవర్గంలోని బూత్‌కి ఒక సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ను నియమించాలని తెలంగాణ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. సోషల్‌ మీడియా కోఆర్డినేటర్లందరికీ పార్టీ తరపున శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ పేర్కొన్నారు.

పురపాలక సంఘాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని పురపాలక సంఘాల ఎన్నికల సమన్వయం కోసం బాధ్యులను సీఎం కేసీఆర్‌ ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తారని తెలిపారు. స్థానికంగా పురపాలక ఎన్నికలు లేని ప్రజాప్రతినిధులు ఇతర ప్రదేశాల్లో బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పారు.

Related posts