telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ బడ్జెట్ … రెండున్నర లక్షల కోట్లపైనే .. : ఆర్థిక మంత్రి

ap budget crosses two lakh crores

ఏపీ ప్రభుత్వం తొలి బడ్జెట్ నేడు ప్రవేశపెడుతుంది. దీనిపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ మొత్తంగా 2.34 లక్షల కోట్లు వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఆర్దిక రంగం మీద శ్వేత పత్రం విడుదల చేసింది. దీనిని ఆధారంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటనేది స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని పూర్తిగా దివాళా తీయించిందని ప్రభుత్వం చెబుతోంది.

నిధులు లేని ఖజానా తమకు అప్పగించినా తమ ప్రాధాన్యతల విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయమని స్పష్టం చేసే దిశగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా..సంక్షేమం..నవ రత్నాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా బీసీ..సాంఘిక సంక్షేమ రంగానికి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉంది. సామాజిక వర్గాల వారీగా కార్పోరేషన్లకు సైతం ఇచ్చిన హామీల మేరకు అంచనాలు ఉంటాచని తెలుస్తోంది.

తాజా బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం రూ.85 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్ల వరకు ఉంటుందని బడ్జెట్‌లో అంచనాకు వచ్చినట్లు సమాచారం. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.60 వేల కోట్లకుపైగా వస్తాయని భావిస్తున్నా రు. కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.34 వేల నుంచి రూ.36 వేల కోట్ల దాకా రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తూ ఈ మేరకు ఆదాయంలో ప్రస్తావించే అవకాశం ఉంది.

Related posts