telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్-ఆసీస్ 4వ టెస్ట్ : రెండో సెషన్ పూర్తి

భారత్-ఆసీస్ మధ్య బ్రిస్బేన్ లో నేడు నాల్గవ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం విషయం తెలిసిందే. ఈ చివరి టెస్ట్ మొదటి రోజులో రెండో సెషన్ ముగిసింది. అయితే ఈ సెషన్ లో ఆసీస్ దే ఆధిపత్యం అని చెప్పాలి. ఎందుకంటే మొదటి సెషన్ పూర్తయే సమయానికి 65/2 తో నిలిచిన ఆసీస్ రెండో సెషన్ పూర్తయే సమయానికి 154/3 తో పటిష్టమైన స్థితిలో నిలిచింది. లాబుస్చాగ్నే(73) అర్ధశతకంతో కొనసాగుతుండగా మాథ్యూ వేడ్(27) తో అతనికి సపోర్ట్ గా నిలిచాడు. ఇక ఈజోడి ఇప్పటికే 67 పరుగుల భాగసౌమ్యని నెలకొల్పింది. అయితే ఈ సెషన్ భారత బౌలర్లు కేవలం ఒక్క స్మిత్ వికెట్ మాత్రమే తీయగలిగారు. అలాగే పేసర్ నవదీప్ సైని గాయం కారణంగా తప్పుకున్నాడు. 37వ ఓవర్లో 5వ బంతి వేసి అక్కడే కుప్ప కూలిపోయిన సైని ఆ ఓవర్ ను ముగించకుండానే బయటకు వచ్చేసాడు. దాంతో ఆ చివరి బంతిని రోహిత్ శర్మ వేసి ఓవర్ ముగించాడు. అయితే సైని మళ్ళీ తిరిగి వచ్చి బౌలింగ్ చేయగలడా… లేదా అనేదాని పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈరోజు ఇంకా 36 ఓవర్ల ఆట మిగిలి ఉంది. మరి చూడాలి ఈ మూడో సెషన్ లో ఎవరి పై చేయి సాధిస్తారు అనేది.

Related posts