ఆర్జేడీ అధినేత లూలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం పై లూలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ సంచలన ఆరోపణలు చేశారు. భార్యతో విడాకులు కోరుతూ ఆరు నెలల క్రితం తేజ్ ప్రతాప్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి అత్తింటివారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.గత మూడు నెలలుగా తనకు తిండి కూడా పెట్టడం లేదని, అత్త రబ్రీదేవి, ఆడపడుచు మీసా భారతిపై ఆరోపణలు గుప్పించారు.
తన అత్తింటివారు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వంటగదికి తాళాలు వేస్తున్నారని, కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఇంట్లో నెలకొన్న పరిస్థితిని వీడియో తీస్తుంటే రబ్రీదేవి బాడీ గార్డ్ వచ్చి తన ఫోన్ లాక్కున్నారని చెప్పారు. తనను తన భర్త, మరిది ఇబ్బంది పెట్టడం లేదని… ఆడపడుచు మీసాభారతి వల్లే సమస్య పెద్దదయిందని మండిపడ్డారు.
డెంగ్యూ గురించి సరైన సమాధానం ఇవ్వడం లేదు: మల్లుభట్టి