telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఆటో డ్రైవర్ కూడా.. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి .. లేదంటే జరిమానా..

auto driver got challan on no seat belt

ప్రభుత్వం ఇటీవలే తీసుకొచ్చిన కొత్త మోటారు వాహనా చట్టం అమలులోకి వచ్చిన అనంతరం భారీగా వసూలు చేస్తున్న జరిమానాలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను అతిక్రమించిన వారి నుండి అధికారులు భారీగా జరిమానాలు వసూలు చేస్తున్నారు. అయితే బీహార్‌లో మాత్రం ఆటోడ్రైవర్‌ సీటుబెల్డ్‌ పెట్టుకోని కారణంగా వెయ్యి రూపాయల జరిమానా పడింది. వివరాల్లోకి వెళితే బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ జిల్లాలోని సరియాలో ఓ ఆటోడ్రైవర్‌ ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు జరిమానా విధించారు.

డ్రైవర్‌ వద్ద తగిన డబ్బులు లేకపోవడంతో తక్కువ మొత్తంలో చలానా జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. అది కూడా సీటు బెల్లు ధరించని కారణంగా కనీస చలానా పరిథి వెయ్యిరూపాయలు విధించారు. దీనిపై స్టేషన్‌ అధికారి స్పందిస్తూ తాను మినిమం చలానా చెల్లిస్తానని ఆటోడ్రైవర్‌ విజ్ఞప్తి చేశాడని, దీంతో రూ.1000లను కట్టించుకున్నామని, సీటు బెల్డ్‌ పెట్టుకోని కారణంగా అతనికి ఈ జరిమాన పడిందని పేర్కొనడం పొరపాటుగా జరిగిందని అన్నారు.

Related posts