telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సినిమాల్లోకి రాకముందు… టీచర్ గా కియారా

Kiara-Advani

2014లో తొలిసారిగా కియారా ‘ఫగలీ’ సినిమాతో బాలీవుడ్‌లో కాలు మోపారు. కానీ అక్కడ సరైన హిట్ ను అందుకోలేకపోయింది ఈ బ్యూటీ. ఆ తరువాత తెలుగులో ‘భరత్ అనే నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ “కబీర్ సింగ్” చిత్రంతో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకుంది కియారా అద్వానీ. ప్రస్తుతం హిందీ సినిమా ‘గుడ్ న్యూస్’తో బిజీగా ఉంది. ఈ సినిమాలో కియారాతో పాటు కరీనా కపూర్‌ఖాన్, అక్షయ్‌కుమార్ తదితరులు నటించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కియారా అద్వానీ తన వ్యక్తిగత వివరాలను వెల్లడించారు. తాను సినిమాల్లోకి రాకముందు ప్రీ స్కూలులో పనిచేసేదానిని, అక్కడ చిన్నపిల్లలకు చదువు చెప్పేదానినని తెలిపారు. కాగా ప్రస్తుత కియారా లెక్కలేనంతమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నారు.

Related posts