పాకిస్ధాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం కరాచీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై జరిగిన ఉగ్రదాడిలో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. అయినప్పటికీ ఇమ్రాన్ మాత్రం తన వక్రబుద్ధిని మరోసారి భారత్ పై ప్రదర్శించారు.
నిన్న పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ కరాచీ స్టాక్ ఎక్స్‌చేంజ్‌పై దాడి వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించారు. కరాచీ దాడి వెనక భారత్ ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. గతంలో ముంబైలో జరిగిన దాడి తరహాలోనే కరాచీలో దాడి చేయాలనుకున్నారని వ్యాఖ్యానించారు.