telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రానా అభిమానులకు గుడ్ న్యూస్… 72 గంటల్లో ఇండియాలో…

Rana

బాహుబ‌లి చిత్రంలో భ‌ళ్ళాల‌దేవ పాత్ర‌తో దేశవ్యాప్తంగా అశేష అభిమానులను సంపాదించుకున్న రానా ద‌గ్గుబాటి తెలుగులో “విరాట ప‌ర్వం” అనే సినిమాతో రానా బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. మరోవైపు హౌస్‌ఫుల్ ఫ్రాంచైజ్‌లో భాగంగా తెరకెక్కుతున్న “హౌస్‌ఫుల్-4” చిత్రంలో పవర్ ఫుల్ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరో వైపున తమిళ, హిందీ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రానా ఇప్పుడు తెలుగులో “విరాటపర్వం”, “హిరణ్యకశ్యప”తో పాటు హిందీలో “హాథీ మేరే సాథీ” సినిమాల్లో నటిస్తున్నారు. యాడ్స్ లోను నటిస్తున్నాడు. రానా ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడనే ప్రచారం జరిగింది. రానా దగ్గుబాటి కొన్ని రోజులుగా ఇండియాలో లేడు. కొన్ని నెలలుగా ఆయన అమెరికాలోనే ఉన్నాడు. అక్కడే చికిత్స తీసుకుంటున్నాడని తెలుస్తుంది. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న రానా అక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అందుకే చాలా బరువు కూడా తగ్గిపోయాడు రానా. కిడ్నీ సంబంధిత సమస్యతో ఈయన బాధ పడుతున్నాడని.. దానికి అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా చేయించుకున్నాడని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై దగ్గుబాటి ఫ్యామిలీ స్పందించలేదు. అయితే తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అబద్ధమే అంటూ ఆ మధ్య చెప్పాడు రానా దగ్గుబాటి. ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇండియాకు వస్తున్నాడు ఈయన. ఇదే విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అభిమానులతో పంచుకున్నాడు రానా. కార్‌లో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసి.. ఆల్రైట్.. ఆన్‌లైన్‌లోకి లోకి వచ్చాను.. మరో 72 గంటల్లో ఇండియాలో ఉంటానంటూ క్యాప్షన్ పెట్టాడు రానా. ఇప్పుడు పెట్టిన ఫోటోలో కూడా రానా చాలా బక్కగా ఉన్నాడు. ఎప్పట్లాగే పొడవాటి గడ్డం.. షార్ట్ హెయిర్ స్టైల్‌తో అదరగొట్టాడు రానా.

 

View this post on Instagram

 

Alright!! Back online!! And will be back in India in 72hours 😉

A post shared by Rana Daggubati (@ranadaggubati) on

Related posts