తాజాగా ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమాలు ఉన్నా, లేకపోయినా తన తమ్ముడు కోటీశ్వరుడే. అతడు ఆర్థిక పరిస్థితుల వల్ల సూసైడ్ చేసుకున్నాడన్న వార్తలను ఆమె కొట్టిపారేసింది. వాళ్ల అమ్మ చనిపోయేముందు 4 కేజీల బంగారం..100 కేజీల వెండితో పాటు మరో మూడు ప్రాంతాల్లో విలువైన ఆస్తులను కూడా ఇచ్చినట్టు వెల్లడించింది. ఉదయ్ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎప్పుడూ ఎదుర్కోలేదంటూ..అతని మరణంపై అనుమానాలు వ్యక్తం చేసింది. కాగా ఉదయ్ కిరణ్ చనిపోయాక..అతని భార్య విషిత అసలు కుటుంబ సభ్యులతో కలిసే ప్రయత్నం కూడా చేయలేదట. ఆస్థులను కూడా ఆమే ఉంచుకుంది అంటూ శ్రీదేవి కీలక విషయాలను బయటకు చెప్పారు. బంగారం, వెండి..ఇతర ఆస్తుల కూడా ఉదయ్ భార్య విశిత దగ్గరే ఉన్నట్టు శ్రీదేవి వెల్లడించారు. విశితను ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా..ఏవో కుంటిసాకులు చెప్పి తప్పించుకునేదని..ఆమె ప్రవర్తన పలు అనుమానాలు దారితీస్తుందని ఉదయ్ సోదరి వెల్లడించారు.
previous post
మరో సావిత్రిలా తయారయ్యేదాన్ని… సిద్ధార్థ్ తో గురించి సమంత సంచలన వ్యాఖ్యలు