telugu navyamedia
సినిమా వార్తలు

తేజ్ ప్రమాదం కాదు .. వివేకా హత్య గురించి మాట్లాడండి

సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వం వహించిన “రిపబ్లిక్ ” సినిమా విడుదల సందర్భగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా జనసేన అధ్యక్షుడు , హీరో పవన్ కళ్యాణ్ వచ్చారు . పవన్ కళ్యాణ్ ఉపన్యాసం అంతా అటు వైకాపా ఇటు మీడియా మీదనే సాగింది .

” తేజ్ మోటార్ సైకిల్ ప్రమాదంపై కొన్ని మీడియా సంస్థలు అతిగా స్పందించాయి . తేజ్ 45 కిలోమీటర్ల అంత వై వేగంతో ముందు వెడుతున్న ఆటో ను ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదానికి గురయ్యాడు . అదీ రోడ్ మీద ఉన్న‌ ఇసుకవల్ల బైక్ జారిపోయింది . దీనికి చిలవలు పలవలు అల్లారు . .అది మావాడి దురదృష్టం , కర్మ , పాపం తేజ్ ఇప్పటికీ ఆసుపత్రి బెడ్ మీదనే వున్నాడు . మేము మనుషులమే , కాస్త కనికరం చూపించండి ” అన్నాడు పవన్ .

Sai Dharam Tej acted Republic Movie Pre Release Event held at JRC Convention Center, Madapur, ...

“మీడియా తేజ్ మీద కాదు కథనాలు రాయవలసింది , సమాజానికి కావాల్సిన‌వి వున్నాయి . వై .ఎస్ . వివేకానంద రెడ్డి గారు ఎందుకు హత్యకు గురయ్యారు ? దాని మీద మాట్లాడండి , తేజ్ ప్రమాదం మీద కాదు . కోడి కత్తి తో ఒక నాయకుణ్ణి పొడిచారు , ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో , అదీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో వున్న విమానాశ్రయం లో పొడిచారు అప్పటి గవర్నర్ నరసింహన్ కూడా దీని వెనుక భారీ కుట్ర ఉందన్నారు. .

ఆ కేసు ఏమైంది , ఇది అడగండి , తేజ్ ప్రమాదం కాదు . లక్షలాది గిరిజనులు పోదు భూముల్లో వ్యవసాయం చేసుకుంటుంటే అవి వారికి దక్కడం లేదు , దీని మీద మాట్లాడండి , తేజ్ ప్రమాదం గురించి కాదు. ఆరేళ్ళ చిన్నారి అన్యాయంగా , అకారణంగా , అమానుషంగా హత్యకు గురైతే అది వదిలేసి తేజ్ 45 కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోయాడు అని రాస్తారు , మాట్లాడ‌తారు .” అని పవన్ మీడియా తీరును ఎత్తి చూపారు .

Related posts