ఇటీవల బ్యాంకు లాకర్ లో దాచిన పత్రాలకు చెదలు పట్టి పాడైపోయిన విషయం తెలిసిందే. దీనితో మిగిలిన ఖాతాదారులు కూడా తమ లాకర్లలో పత్రాల గురించి బెంబేలెత్తి పోతున్నారు. దీనితో సదరు బ్యాంకు కు వారందరు క్యూ కట్టారు. అందులో ఇద్దరు ఉపాధ్యాయులు తమ లాకర్‌ను పరిశీలించగా దస్తావేజులను చెదలు పూర్తిగా తినేయడంతో లబోదిబోమన్నారు.
ఆ బ్యాంక్‌తో సహా మిగతా కొన్ని బ్యాంక్ లాకర్లను ఖాతాదారులు పరిశీలించుకుంటున్నారు. ఈ విషయంపై లాకర్లను సరఫరా చేస్తున్న గోద్రెేజ్ కంపెనీ అప్రమత్తమైంది. మన్సూరాబాద్ డివిజన్ సహారా రోడ్డులో ఉన్న ఆ బ్యాంక్ మేనేజర్ సోమశేఖర్ స్పందిస్తూ ఎవరూ ఎలాంటి ఆందోళన పడవద్దని, ఆ ఒక్క లాకర్ తప్పా మిగతా లాకర్లు బాగనే ఉన్నాయని భరోసా ఇచ్చారు.