telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

జన్మలో చంద్రబాబు సీఎం కాలేడు…‌హైదరాబాదులో పాచి పని చేసుకుంటున్నారు !

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ పార్టీ చిత్తు చిత్తైంది. 95 శాతం కంటే ఎక్కువగా మున్సిపాలిటీలు, మొత్తం కార్పొరేషన్లకు వైసీపీ అవలీలగా కైవసం చేసుకుంది. అయితే తాజాగా మున్సిపల్‌ ఫలితాలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా వన్‌సైడ్‌ విజయం కట్టబెట్టారని…జగన్‌ దెబ్బకు టీడీపీ పనైపోయిందని మంత్రి కొడాలి నాని అన్నారు. చంద్రబాబు జీవితంలో మళ్లీ సీఎం కాలేరని..చంద్రబాబు, లోకేష్‌ ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పప్పు నాయుడు.. తుప్పు నాయుడు మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ హైదరాబాదులో పాచి పని చేసుకుంటున్నారని…
చంద్రబాబుకు ఈ ఫలితం కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని… ప్రజలకు జగన్‌ ఎలా దగ్గరయ్యారో చంద్రబాబు ఇప్పటికైనా తెలుసుకోవాలని కొడాలి నాని సూచించారు.  చంద్రబాబు గుంటూరు, విజయవాడ పర్యటనల్లో ప్రజలకు సిగ్గులేదన్నారని..కృష్ణా, గుంటూరు తీర్పుతోనైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలని హితువు పలికారు. జగన్‌ ఇచ్చిన ప్రతిమాటను నెరవేర్చుతూ ముందుకు సాగారని.. అమరావతి రైతులు చంద్రబాబు మాటలను ఇప్పటికైనా నమ్మవద్దని కొడాలి నాని కోరారు. అమరావతి అభివృద్ధి కోరుతూ రైతులు ప్రభుత్వం దగ్గరికి రావాలని తెలిపారు.

Related posts