తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శలు గుప్పించారు. సోమవారం జనగామాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ మొహం చాటేశాడని విమర్శించారు. సమైక్య పాలనలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించి, సీఆర్ మజ్లిస్‌కు తొత్తుగా మారాడని దుయ్యబట్టారు. యాదాద్రి దేవస్థానంలో దేవుడి కన్నా ఎక్కువగా కేసీఆర్ బొమ్మలు చెక్కించి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని లక్ష్మణ్ మండిపడ్డారు. హిందువులు చేసిన పోరాటంతో కేసీఆర్ బొమ్మలు తొలగించారని తెలిపారు. . ప్రతి గ్రామంలో సెప్టెంబర్ 17న జాతీయ జెండా ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.