తమిళ స్టార్ హీరో సూర్య సతీమణి, హీరోయిన్ జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన చిత్రం “రాక్షసి”. ఇటీవల విడుదలైన ఈ సినిమాలో జ్యోతిక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా నటించింది. ఈ సినిమాలో టీచర్లు పిల్లలకు సరిగా పాఠాలు చెప్పకుండా కథల పుస్తకాలు చదువుకుంటున్నట్లు, సెల్ ఫోన్ తో కాలం గడుపుతున్నట్లు చూపించారు. గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్లు అధిక వేతనాలు తీసుకుంటున్నారని, అయినా స్టూడెంట్స్ పై దృష్టి పెట్టకపోవడం వల్లే వారు వైద్య విద్య వంటి ఉన్నత చదువులు చదవలేకపోతున్నారనే సన్నివేశాలు ఈ చిత్రంలో కన్పించాయి. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు నిజాయితీగా పని చేసే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యులను కించపరిచే విధంగా ఉన్నాయని విమర్శలు తలెత్తుతున్నాయి. దీంతో తమిళనాడు ఉపాధ్యుల సంఘం రాష్ట్రం అధ్యక్షుడు పీకే.ఇళమారన్ ఇటీవల చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీస్ లో “రాక్షసి” సినిమాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. జ్యోతిక నటించిన “రాక్షసి” సినిమాలో ఉపాధ్యాయుల వల్లే దేశం నాశనం అవుతోందన్నట్లు కొన్ని డైలాగ్స్, సన్నివేశాలు చోటు చేసుకున్నాయని, ఇది ఉపాధ్యాయులందరినీ కించపరిచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాపై నిషేధం విధించాలని, నటి జ్యోతిక, చిత్రబృందంపై చర్యలు చేపట్టాలని కోరారు.
previous post