telugu navyamedia
సినిమా వార్తలు

నాగబాబుకు శివాజీరాజా రిటర్న్ గిఫ్ట్…!

Sivajiraja

ఇటీవల (మా) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్, నరేష్ ప్యానల్ పోటీ పడగా, అందులో నరేష్ ప్యానల్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో నరేష్ కు మెగా ఫ్యామిలీ, నాగబాబు, మహేష్ బాబు, నాగార్జున లాంటి వారంతా నరేష్ కు తమ సపోర్ట్ చేశారు. అయితే స్పెషల్ గా నరేష్ కు నాగబాబు చేసిన సపోర్ట్ కీలకంగా మారింది. అంతేకాదు ప్రెస్ మీట్ లో శివాజీరాజాకు ఎందుకు సపోర్ట్ చేయడం లేదో వివరణ ఇస్తూ నాగబాబు చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు శివాజీరాజా ఇచ్చిన కౌంటర్ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడిన శివాజీరాజా వృద్ధులైన కళాకారుల కోసం ఓల్డేజ్ హోమ్ కట్టాలనేది తన కలని, కానీ దానిపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తనకు 30 ఏళ్ళ నుంచి స్నేహితుడైన నాగబాబు తనకు గిఫ్ట్ ఇచ్చాడని, త్వరలోనే తాను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం.

Related posts