telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వద్దొద్దు బాబోయ్ మీకో దండం…” అంటున్న ప్రదీప్

pradeep

యాంకర్ ప్రదీప్ మాచిరాజు ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ అనే రొమాంటిక్ కామెడీ మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర ‘ఆర్య 2’, ‘నేనొక్కడినే’ సినిమాలకు పనిచేసిన మున్నా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అమృత అయ్యర్ కథానాయిక. ఇటీవల విడుదల చేసిన ‘నీలి నీలి ఆకాశం’ పాట సోషల్ మీడియాలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. 60 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. తాజాగా ‘వద్దొద్దు తల్లో మీకో దండం’ అనే వీడియో సాంగ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ ట్యూన్‌కి.. ‘నీలి నీలి ఆకాశం’ పాట రాసిన చంద్రబోస్ లిరిక్స్ రాయగా ధనుంజయ్, మోహనా భోగరాజు పాడారు. మ్యూజిక్, లిరిక్స్, శేఖర్ మాస్టర్ స్టెప్స్.. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీసాంగ్‌కు హైలెట్ అయ్యాయి. రిలీజ్ చేసిన 24 గంటల్లోనే 3 మిలియన్ల వ్యూస్ దాటేసి ట్రెండింగ్‌లో ఉందీ పాట.. ఇటీవలే సెన్సార్ పనులు పూర్తయ్యాయి. మార్చి 25న ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts