telugu navyamedia
రాశి ఫలాలు

డిసెంబర్‌ 7, మంగళవారం రాశిఫలాలు..

మేషరాశి..

తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. శ్ర‌మ‌కు త‌గిన ఫ‌లితం ల‌భించ‌దు. కటుంబంలో అనుకోని సమస్యలు రావచ్చు. అనవసపు వివాదాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రిప్రజెంటేటిలకు, ఉపాధ్యాయులకు, మార్పులు అనుకూలిస్తాయి. దూరప్రయాణం చేసే అవకాశం ఉంటుంది.

వృషభరాశి..

ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఎదురుకావచ్చు. .దైవ, సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. . స్త్రీలు వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటారు. రాజకీయనాయకులకు సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు చేయడం మంచిది కాదు. తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయండి.ఓర్పు చాలా అవసరం.

మిథునరాశి..

వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నం అనుకూలించడంతో మీలో నూతన ఉత్సాహం చోటు చేసుకుంటుంది. బంధువుల నుంచి ధనలబ్ధి. పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

కర్కాటకరాశి..

వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఏదైనా పనులు చేపట్టే ముందు ఆలోచించి చేపట్టడం మంచిది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ మందుల వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ ప్రకటనలపై ఏకాగ్రత వహించండి. విద్యార్థులకు తమ ధ్యేయం పట్ల ఆసక్తి, పట్టుదల అధికమవుతాయి. ఇంట్లో సమస్యలు తీరుతాయి. ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది.

సింహరాశి..

మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. స్థిరాస్తి విక్రయంలో తొందరపాటు తగదు. వృత్తి, వ్యాపార రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఆశించిన మార్పులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

కన్యరాశి..

వ్యాపార విస్తరణ, పరిశ్రమల స్థాపనకు యత్నాలు చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. అవసరానికి సాయం చేసేవారున్నారు.

తులరాశి..

చాలా కాలంగా ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. శత్రువులు మిత్రులుగా మారి సహయం అందిస్తారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించే ముందు జాగ్రత్తలు తప్పనిసరి.

వృశ్చికరాశి..

ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. స్త్రీలకు బంధువర్గాలతో పట్టింపులు అధికమవుతాయి. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాలపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి.

ధనస్సు రాశి..

నిరుద్యోగులకు అధికారుల అండదండలతో ఉన్నత అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహరాల్లో ప్లీడర్లకు తమ క్లయింట్స్ ధోరణి చికాకు కలిగిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి పనివారితో చికాకులు తప్పవు.అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

మకరరాశి..

వ్యాపార విషయంలో జాగ్రత్తలు అవసరం. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు ఏర్పడి కొంత చికాకు తెప్పిస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. . ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. గొప్ప ఆలోచనా విధానంతో అభివృద్ధిని సాధిస్తారు.

కుంభరాశి..

అధికారుల సహకారం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు పరిస్థితులు తారుమారు కాకుండా జాగ్రత్త పడడం మంచిది. విద్యార్థులకు ప్రతీ విషయంలోను ఏకాగ్రత, కొత్త విషయాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్ప‌డ‌తాయి.

మీనరాశి..

వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం తప్పవు. ఉద్యోగస్తులు సేవా, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. ఆకస్మి ధనలాభం క‌లుగుతుంది.

 

 

Related posts