telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పారితోషికం పెంచేసిన బాలకృష్ణ…. నిర్మాత స్పందన ఇదీ…!

fans upset with balakrishna ruler movie still

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 105వ చిత్రానికి “రూల‌ర్” అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ధర్మ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలయ్య నటిస్తున్నట్టు ఈ పోస్టర్ చూస్తుంటే అర్థం అవుతోంది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండ‌గా ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి సి.రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేశారని, ప్రస్తుతం ఆయన చేస్తున్న ‘రూలర్’ సినిమాకు భారీగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి. గతేడాది వచ్చిన ‘జైసింహా’ సినిమాకు రూ.6 కోట్లు తీసుకున్న బాలయ్య.. ఇప్పుడు ‘రూలర్’ సినిమాకు రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఈ రెండు సినిమాలకు సి.కళ్యాణే నిర్మాత. దీంతో ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపించింది. బాలకృష్ణ రెమ్యునరేషన్ పెంచేయడంతో బడ్జెన్‌ను సరిచేసుకోవడానికి మిగిలిన డిపార్ట్‌మెంట్లలో పనిచేసేవారికి సి.కళ్యాణ్ కోత విధిస్తున్నారని కూడా రూమర్ వచ్చింది. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని నిర్మాత సి.కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. బాలయ్య పారితోషికం కోసం నిర్మాతలను ఇబ్బంది పెట్టే మనిషి కాదని కళ్యాణ్ అన్నారు. ‘‘బాలకృష్ణతో గతంలో పనిచేశాను. ఆయన చాలా మంచివారు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. ఎప్పుడూ ఏదీ డిమాండ్ చేయలేదు. రెమ్యునరేషన్ ఎక్కువగా అడుగుతున్నారనే వార్తల్లో నిజం లేదు. మా మధ్యన రెమ్యునరేషన్ గురించి అసలు చర్చే జరగలేదు. సినిమా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోంది’’ అని కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Related posts