telugu navyamedia
తెలంగాణ వార్తలు

యాదాద్రి సన్నిధిలో సీఎం కేసీఆర్..

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మంగ‌ళ‌వారం యాదాద్రి ల‌క్ష్మిన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. బాలాల‌యంలో స్వామివారికి ద‌ర్శించుకుని వేద పండితులు ఆయన్ను ఆశీర్వచనం తీసుకున్నారు . కేసీఆర్‌కు ఆలయ పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ పున:నిర్మాణ పనులను ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తుది దశ పనులపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

CM KCR visits Yadadri Lakshmi Narasimha Swamy today

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెట్టాలని, ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, కరోనా మహమ్మారి పీడ తొలగాలని స్వామిని వేడుకున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్.. యాదాద్రి ఆలయ ఉద్ఘాటన ముహూర్తం ప్రకటించనున్నారని సమాచారం

సీఎం వెంట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌రణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మ‌ల్లారెడ్డి, మండ‌లి మాజీ చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, గ్యాద‌రి కిశోర్, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, టీఆర్ఎస్ నాయ‌కులు మోత్కుప‌ల్లి న‌ర్సింహులుతో పాటు ప‌లువురు ఉన్నారు. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఉన్నారు.

Related posts